ఆ పథకానికి అంబేడ్కర్ పేరు తీసేసి.. జగన్ పేరు : చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతే ఎస్సీ, ఎస్టీలకు అన్ని రకాల పథకాలు, పదవులు దక్కాయని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో దళిత వర్గాలతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ కాలనీల్లో రహదారులు సహా అన్ని సౌకర్యాలు కల్పించామని, 100 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్తు ఇచ్చామని చంద్రబాబు గుర్తు చేశారు. టీడీపీ హయాంలో మొత్తం 28 పథకాలు ఇస్తే, వైసీపీ గెలిచాక కార్పొరేషన్లు పెట్టడం తప్ప ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. ఎస్సీ సబ్‌ప్లాన్ పెట్టడమే కాదు, అమలు చేసే పరిస్థితి ఉండాలని సూచించారు. 2001లో జస్టిప్ పున్నయ్య కమిషన్ వేశామన్నారు. అంబేడ్కర్ విదేశీ విద్యా పథకం తీసుకొచ్చామని తెలిపారు. ఇప్పుడు ఆ పథకానికి అంబేడ్కర్ పేరు తీసేసి, జగన్ పేరు పెట్టుకున్నారని విమర్శించారు.













