గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం…అభ్యర్థి ఖరారు!
మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. ముఖ్యమంత్రి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గుంటూరు లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా రాయుడును దాదాపు ఖరారు చేశారు. గత ఆరు నెలల నుంచి రాయుడు గుంటూరు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీంతో ఆయనకు లోక్‌సభ స్థానం కేటాయించనున్నట్లు కొంతకాలంగా వైసీపీలో చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, వైసీపీ లోక్‌సభాపక్ష నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాల్గొన్నారు.













