చంద్రబాబు వల్లే పోలవరానికి ఈ దుస్థితి: మంత్రి అంబటి
పోలవరం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ఎంపీలు, ఎమ్మెల్యే బృందం పరిశీలించింది. అనంతరం మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మరన్నారు. పోలవరం పూర్తి కోసం చిత్తశుద్ధిగా పని చేస్తున్నాం. చంద్రబాబుకు ప్రచార యావ తప్ప మరొకటి లేదు. కాఫర్ డ్యాం నిర్మించకుండా డయాఫ్రం వాల్ నిర్మించారు. టీడీపీ హయాంలో పోలవరాన్ని సర్వనాశనం చేశారు. చంద్రబాబు చేసిన పాపాల వల్లే పోలవరానికి ఈ దుస్థితి అంటూ మండిపడ్డారు. ఎంపీలు కోటగిరి శ్రీధర్, మార్గాని భారత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, ధనలక్ష్మి పోలవరం ప్రాజెక్టును పనుల పురోగతిని పరిశీలించారు.













