కనిపించని కూటమి నాలుగవ పార్ట్నర్ పోలీసులు .. అంబటి రాంబాబు..
ఆంధ్ర ఎన్నికల్లో ఈసారి అభ్యర్థులతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికలకి ముందు రెడ్ బుక్ పట్టుకొని లోకేష్ ఆంధ్రా పోలీసులు వైసీపీకి మద్దతుగా ఉంటున్నారు అని హడావిడి చేశారు. ఎన్నికల సమయంలో డీజీపీ తో పాటు ఎందరో ఎస్పీలు, ఇతర అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఎన్నికల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంలో భాగంగా ఇదంతా చేస్తున్నాం అని ఎన్నికల సంఘం పేర్కొన్న విషయం అందరికీ తెలిసిందే.
అయితే ఎన్నికల తరువాత సీన్ రివర్స్ అయ్యింది.ఎన్నికల సమయంలో శాంతిభద్రతలు అమలు పరచడంలో పోలీసులు పక్షపాతం చూపిస్తున్నారు అని పోలింగ్ కు ముందు వైసీపీ నేతలు విమర్శించారు. ఇక ఎన్నికల తర్వాత కూడా పోలీసులపై వైసీపీ నేతల కౌంటర్లు ఆగడం లేదు. తాజాగా అంబటి రాంబాబు పోలీసులను ఉద్దేశిస్తూ ఒక ఘాటైన ట్వీట్ వేశారు. కూటమిలో బయటకు కనిపించే భాగస్వాములు ముగ్గురు అయితే.. కనిపించని ఆ నాలుగవ పార్ట్నర్ ఏపీ పోలీసులు అంటూ అంబటి తనదైన శైలిలో విమర్శించారు. ఎన్నికలు జరిగిన రోజు, ఆ తర్వాత రోజు కూడా ఏపీలో కొన్నిచోట్ల శాంతిభద్రతల సమస్యలు ఎదురయ్యాయి. మరి ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పల్నాడు లో జరిగిన ఘర్షణలో ఎక్కువగా నష్టపోయింది వైసీపీ అనడంలో ఎటువంటి డౌట్ లేదు. దీంతో అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్ పోలీస్ విభాగం పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.













