Chandrababu: పవన్ సినిమా పాటను చంద్రబాబుకు అంకితం ఇచ్చిన అంబటి..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార పార్టీ టీడీపీ (TDP) ku వైసీపీ (YCP) మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ తీవ్రమవుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై (Nara Chandrababu Naidu) వైసీపీ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) తరచూ విమర్శలు గుప్పించడం తెలిసిందే. తాజాగా ఆయన చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఖుషి (Khusi) సినిమాలోని “ఆడవారి మాటలకూ అర్థాలే వేరులే” పాటను ప్రస్తావిస్తూ, “చంద్రబాబు మాటలకు అర్థాలే వేరులే” అంటూ ఎద్దేవా చేశారు. 2019లో ఓటుకు నోటు కేసు సమయంలో దొరికిపోయినప్పటికీ, చంద్రబాబు తనను నిజాయితీ పరుడిగా చిత్రీకరించుకోవడంపై విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఆరు నెలల్లోనే రూ.1.20 లక్షల కోట్లు అప్పులు చేసి, రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు ప్రస్తావనలోకి కూడా రాకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
అంతే కాదు ఐపీఎస్ అధికారులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తీసుకుంటోందని విమర్శించారు. పేర్ని నాని భార్యను పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారణ జరపడం కక్ష సాధింపు చర్యలలో భాగమని తెలిపారు. గోడౌన్లో బియ్యం పోతే డబ్బులు కట్టించుకోవచ్చని, కానీ క్రిమినల్ కేసులు పెట్టడం దుర్మార్గమని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు పూర్తిగా విఫలమయ్యాయని, గత ఆరు నెలల్లో అభివృద్ధి కంటే కక్ష సాధింపే ఎక్కువగా కనిపిస్తోందని ఆరోపించారు. “చంద్రబాబు తాను నిప్పులాంటి వ్యక్తి అని చెబితే దాని అసలు అర్థం తుప్పులాంటి వ్యక్తి” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల ఒక సంస్థ చంద్రబాబు దేశంలో అత్యంత ధనవంతులైన ముఖ్యమంత్రులలో ఒకరుగా ప్రకటించిందని, ఇది ఆయన అక్రమ సంపాదనకు నిదర్శనమని అంబటి రాంబాబు విమర్శించారు. ఎన్నికల సమయంలో డబ్బు ప్రవాహం కొనసాగించడంలో చంద్రబాబు ముందంజలో ఉన్నారు అంటూ ఆరోపణలు చేశారు. ఆయన చెప్పే అబద్ధాలను లెక్కపెడితే కచ్చితంగా చంద్రబాబుకి ఈ విషయంలో గిన్నిస్ బుక్ లో స్థానం దక్కుతుంది అంటూ వ్యాఖ్యానించారు. అయితే మరోపక్క రెండు పార్టీలు పరస్పర వ్యాఖ్యానాలతోనే పబ్బం గడుపుతున్నాయి తప్ప ప్రజల కోసం పనిచేస్తున్న దాఖలు కనిపించడం లేదు.. ఇటువంటి అనవసరమైన విమర్శలకు స్వస్తి చెప్పి ఇకనైనా నేతలు అభివృద్ధి మీద దృష్టి పెట్టడం ముఖ్యం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.













