మేము వెళ్లగొట్టిన వాళ్లే.. వాళ్లకు దిక్కవుతున్నారు.. అంబటి
ఆంధ్రాలో ఎన్నికల నేపథ్యంలో నేతలు పార్టీలు మారడం చాలా కామన్ అయిపోయింది. ఈ నేపథ్యంలో తమ పార్టీ నుంచి వెళ్ళిపోతున్న నేతలపై అంబటి రాంబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాము వద్దు వెళ్ళిపోండి అని చెప్పిన నేతలను చంద్రబాబు రమ్మని ఆహ్వానించి వాళ్లకు టికెట్ ఇస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. లావు కృష్ణదేవరాయులు, జంగా కృష్ణమూర్తి తమ పార్టీ నుంచి వెళ్లి సైకిల్ ఎక్కిన వారే అని విమర్శించారు. తాను టీడీపీ పై, చంద్రబాబు, పవన్ లపై విమర్శలు చేశానే తప్ప ఎప్పుడూ తిట్టింది లేదు అని అంబటి స్పష్టం చేశారు. అయితే చంద్రబాబు మరీ దిగజారి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. అంతేకాదు శాసనసభ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో టీడీపీ కు అన్నిచోట్ల తిరస్కారమే ఎదురవుతుందని అంబటి పేర్కొన్నారు. ఈసారి 175 స్థానాలలో వైసీపీ జెండా ఎగిరి తీరుతుంది అని అంబటి ధీమా వ్యక్తం చేశారు.













