కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని కలిసిన అమరావతి మహిళలు
అమరావతిలో రాజధానిని కొనసాగించాల్సిన ఆవశ్యకతను తెలియజేసేందుకు ఢిల్లీ వెళ్లిన మహిళా ఐకాస నాయకులు మూడో రోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాను కలిశారు. అమరావతి సమస్య, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వారికి వివరించారు. అజయ్ భల్లాకు మహిళా ఐకాస నాయకులు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఐకాస మహిళ నేతలు మాట్లాడుతూ రాజధానిగా అమరావతిని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. అమరావతి రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని కిషన్రెడ్డి, అజయ్భల్లాను కోరామన్నారు. ఈ విషయంలో వారు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. రైతులకు అన్యాయం జరగన్విమని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారన్నారు. ఆఫిడవిట్ల విషయాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లామన్నారు.













