17న జంతర్ మంతర్ వద్ద ధర్నా
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేసిన మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఢిల్లీలో నిరసన తెలపాలని అమరావతి పరిరక్షణ సమితి నిర్ణయించింది. డిసెంబర్ 17, 18, 19 తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు శివారెడ్డి, కార్యదర్శి గద్దె తిరుపతి రావు ప్రకటించారు. ధరణి కోట నుంచి ఎర్రకోట వరకు నిరసన యాత్ర ఉంటుందని ఐకాస నేతలు తెలిపారు. 1800 మందితో ప్రత్యేక రైలులో రాజధాని ప్రాంత రైతులు ఢిల్లీ వెళ్తారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. 17న జంతర్ మంతర్లో ధర్నా చేపడతామని, 18న ఇతర రాస్ట్రాల ఎంపీలను కలవనున్నట్లు తెలిపారు. 19న రామ్లీలా మైదానంలో జరిగే కిసాన్ సంఫ్ులో పాల్గొంటామని తెలిపారు.













