రాజధాని బంద్ ప్రశాంతం…
జైలు భరో కార్యక్రమంలో మహిళలపై పోలీసులు చేసిన దాడిని నిరసిస్తూ జేఏసీ నేతలు పిలుపు మేరకు అమరావతి 29 గ్రామల్లో రైతులు బంద్ నిర్వహించారు. రాయపూడి, అనంతవరం, కృష్ణాయపాలెం, తుళ్లూరు తదితర గ్రామాల రైతులు, మహిళలు రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ నినాదాలు చేశారు. 3 రాజధానులకు మద్దతుగా తమ భూముల్లో కూర్చోవడానికి వస్తున్న పెయిడ్ ఆర్టిస్టులను పంపించివేయాలని లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కృష్ణాయపాలెం రైతులు సృష్టం చేశారు. అబ్బరాజుపాలెం శిబిరానికి 29 గ్రామాల అసైన్డ్, దళిత రైతులు చేరుకొని అమరావతి కొనసాగించేలా చూడాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాష్ట్రంలో ఐపీసీ కంటే వైసీసీ సెక్లన్లే ఎక్కువగా అమలవుతున్నాయని తెనాలి శ్రావణ్ కుమార్ విమర్శించారు.













