సింగపూర్ యాత్రకు రాజధాని రైతులు
ఆంధ్రప్రదేశ్ రాజధాని రైతుల మూడో విడత సింగపూర్ యాత్రను వెలగపూడి సచివాలయంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. అమరావతి ప్రాంతినికి చెందిన 39 మంది రైతులు, ఇద్దరు డిప్యూటీ కలెక్టర్లు సాధన, శేషిరెడ్డి, అధికారులు కృష్ణకపర్తి, కె.దివ్వ బృందం ప్రత్యేక బస్సులో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బయలుదేరి వెళ్లింది. అక్కడి నుంచి సింగపూర్‌కు ప్రత్యేక విమానంలో వెళ్లేందుకు ఏపీసీఆర్డీఏ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు రెండు విడతల్లో 68 మంది రైతులు సింగపూర్ యాత్రను విజయవంతంగా ముగించుకొని వచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఆర్డీఏ ప్రత్యేక కమిషనర్ వి.రామమనోహరరావు, ల్యాండ్స్ డైరెక్టర్ బిఎల్.చెన్నకేశవరావు తదితరులు పాల్గొన్నారు.













