ఆంధ్రప్రదేశ్ కు అమరావతే ఏకైక రాజధాని : రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్‌లోకి చేరుకుంది. కర్నూలు జిల్లా హాలహర్వి నుంచి ప్రారంభమై ఆలూరి సరిహద్దుకు చేరుకుంది. జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీని అమరావతి ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు, పోలవరం నిర్వాసిత రైతులు కలిశారు. స్థానిక రైతులతో కలిసి నినాదాలు చేస్తూ రాహుల్ బస చేసిన శిబిరానికి చేరుకున్నారు. ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగేలా చూడాలని రాహుల్‌కు వినతిపత్రం సమర్పించారు. వారి వినతిపై రాహుల్ స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్‌కి అమరావతే ఏకైక రాజధాని కావాలి. అమరావతి రైతలు పోరాటానికి నేను సంఫీుభావం తెలుపుతున్నాం. రైతుల పోరాటానికి న్యాయ సహాయం అందిస్తాం అని రాహుల్ తెలిపారు.













