మండలి చైర్మన్‌కు అభినందనల వెల్లువ
అధికారపక్ష దాడులను సమర్థంగా ఎదుర్కొని రాజధాని వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేసిన శాసనమండలి చైర్మన్ షరీఫ్‌కు రాజధాని రైతులు నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. రాజధాని గ్రామాల రైతు, ఐకాస నేతలు షరీఫ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మంగళగిరి పాతబస్టాండ్ వద్ద షరీఫ్ ఫ్లెక్సీకి ఐకాస నేతలు, తుళ్లూరు, రాయపూడిలో షరీఫ్ చిత్రపటాలకు రైతులు పాలాభిషేకం నిర్వహించారు. తమ ఆకాంక్షలకు అనుగుణగా వ్యవహరించిన మండలి చైర్మన్ చరిత్రపుటల్లో నిలిచిపోతారని రైతులు, ఐకాస నేతలు కొనియాడారు. మంత్రులు, వైకాపా నేతలు ఒత్తిడి తెచ్చినా ఎంతో ధైర్యంగా రైతుల పక్షాన నిలిచారని అభినందనలు తెలియజేశారు.













