అమరావతి బాండ్లకు భారీ డిమాండ్
బాంబే స్టాక్ ఎక్ఛేంజ్లో ఏపీ సీఆర్డీఏ బాండ్లు రికార్డు స్థాయిలో కొనుగోలు అయ్యాయి. ఒకటిన్నర రెట్లు ఒవర్ సబ్స్క్రైబ్ అయ్యాయి. రూ.1300 కోట్ల బాండ్లు విడుదల చేయగా రూ.2వేల కోట్లకు పైగా ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యాయి. గంట వ్యవధిలోనే బాండ్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యాయి. ప్రభుత్వ క్రెడిబులిటీ కారణంగానే ఇది సాధ్యమైందని సీఆర్డీఏ అధికారులు అంటున్నారు. ఓవర్ సబ్స్క్రైబ్ అవడం దేశంలో మొదటి సారి అని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు దేశంలో పురపాలక సంఘాలన్నీ కలిపి రూ.1800 కోట్లకు మాత్రమే బాండ్లు కొనుగోలు అయ్యాయి. అమరావతి నిర్మాణానికి నిధుల సేకరించే పనిలో భాగంగా ఏపీ ప్రభుత్వం అమరావడతి షేర్లను స్టాక్ ఏక్ఛేంజ్లో అమ్మకానికి పెట్టింది. ఓ రాజధాని నిర్మాణం కోసం దేశంలో మొదటి సారిగా బాండ్లు జారీ చేశారు. ఈ బాండ్లు రూ.10లక్షల ముఖవిలువతో సంస్థాగత మదుపర్లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. తొలివిడతో భాగంగా రూ.1300 కోట్ల నిధుల సేకరణకు అమరావతి బాండ్లను సీఆర్డీఏ విడుదల చేసింది.













