అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించే వరకు పోరాటం
రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉద్ధృతం చేయాలని అమరావతి పరిరక్షణ సమితి ఐకాస అఖిలపక్ష సమావేశం తీర్మానించింది. రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకునేలా ఢిల్లీలో పర్యటించాలని విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని నిర్ణయించారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించే వరకు తమ పోరాటం ఆపే ప్రసక్తే లేదని అమరావతి పరిరక్షణ సమితి ఐకాస నేతలు సృష్టం చేశారు. ఈ సమావేశానికి టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీల నుంచి నేతలు హాజరయ్యారు.
అమరావతి పోరాటం పట్ల ప్రభుత్వ వైఖరిని ఖండించాయి. జగన్ పాలన వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అభిప్రాయడ్డారు. అమరావతిని సాధించే వరకు అలుపెరుగని పోరాటం చేయాలని తీర్మానించారు. రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాన్ని ఉద్ధ•తం చేస్తామన్నారు. రాజధాని కోసం రాజకీయాలను పక్కనపెట్టి వివిధ పార్టీల నాయకులు ముందుకు వచ్చారని తెలిపారు. అమరావతిని రక్షించుకోకపోతే చరిత్ర మనల్ని క్షమించదని పేర్కొన్నారు. న్యాయస్థానాలు కూడా అండగా నిలుస్తున్నాయని, రాజధానిని కాపాడుకోవడమే మన అజెండా అని ఐకాస నేతలు సృష్టం చేశారు.













