రాజధానిపై డాక్యుమెంటరీ విడుదల చేసిన టీడీపీ
రాజధాని నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి శ్రమను వివరిస్తూ తెలుగుదేశం పార్టీ ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. హైదరాబాద్లో రాళ్ల గుట్టలుగా ఉన్న ప్రాంతాన్ని ఐటీ నగరంగా ఆయన ఎలా తీర్చిదిద్దారు. దానికి ఎంత కష్టపడ్డారు. దాని వల్ల హైదరాబాద్ రూపు రేఖలు ఎలా మారాయి. ఇప్పుడు అమరావతి నిర్మాణానికి ఆయన ఎలాంటి ప్రణాళిక రూపొందిస్తున్నారు. దాని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న అంశాలతో మన చంద్రబాబు… మన అమరావతి పేరుతో ఈ వీడియో రూపొందింది. చాలా చక్కగా ఈ వీడియో రూపొందిందని, కొత్త రాజధాని నిర్మాణ అవసరం, దాని ప్రణాళికలపై ఇది మంచి అవగాహన కలిగిస్తోందని కొందరు మంత్రులు పేర్కొన్నారు.













