భూముల స్వాధీనం గురించి సమాచారం లేదు: అమర రాజా గ్రూప్
చిత్తూరు సమీపంలో తాము ప్రారంభించనున్న పరిశ్రమ కోసం గతంలో తదేపా ఎంపీ గల్లా జయదేవ్‌కు సంబంధించిన అమరరాజా ఇండస్ట్రీస్‌కు గత ప్రభుత్వం కేటాయించిన 483 ఎకరాల భూములను వెనక్కి తీసుకుంటూ తాజాగా వైసీపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం విదితమే. తమకు కేటాయించిన స్థలంలో రూ.2వేల కోట్ల పెట్టుబడి పెడతామని, 20వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని సంస్థ అప్పట్లో పేర్కొన్నట్టు సమాచారం. అయితే చెప్పినట్టుగా కార్యకలాపాలు చేపట్టని కారణంగా తాము ఈ భూముల్ని వెనక్కి తీసుకుంటున్నామని ప్రభుత్వం అంటోంది. అయితే ఇది రాజకీయ కక్షసాధింపేనని, ఒక యువ పారిశ్రామిక వేత్తను వేధిస్తున్నారంటూ తేదేపా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నారు. ఈ నేపధ్యంలో భూములు వెనక్కు తీసుకుంటున్న విషయం తమకు తెలియనే తెలీదంటూ అమర్‌రాజా గ్రూప్ ఓ ప్రకటన విడుదల చేయడం విశేషం. ఆ గ్రూప్ విడుదల చేసిన పత్రికా ప్రకటన యధాతధంగా..
అమర రాజా గ్రూప్ యొక్క కార్పొరేట్ కమ్యూనికేషన్స్ ప్రకటన
పత్రిక ప్రకటన :
02.07.2020 మేము అమర రాజా ఇన్ఫ్రా, (అమర రాజ గ్రోత్ కారిడార్)చిత్తూరు భూములకు సంబంధించిన GO గురించి మీడియా మరియు సోషల్ మీడియాలో మాత్రమే తెలుసుకోవడం జరిగినది, ఈ విషయానికి సంబంధించి మాకు ఇప్పటివరకు అధికారికంగా సమాచారం రాలేదని మేము స్పష్టం చేస్తున్నాము. అమర రాజా సంస్థ ని ప్రారంభించినప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలను సృష్టించడం, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం మే లక్చ్యంగా వాటిని కొనసాగిస్తూనే ఉంటుంది.మేము మా నిబంధనలకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తాము మరియు వాటిని నెరవేర్చేదానికి ఇప్పటికి లక్చ్యాన్ని కలిగి ఉన్నాము మరియు ఆ లక్చ్యాన్ని సాధించే దిశగా ప్రయతినిస్తూనే ఉన్నాము. అమర రాజా సంస్థ నీతి మరియు నైతికతలకు అత్యున్నత గౌరవం కలిగిన ఒక సమగ్ర సంస్థ, మరియు సమాజ ప్రయోజనాల కోసం ఎల్లప్పుదు కృషి చేస్తుంటుంది.
ఇట్లు,
అమర రాజా గ్రూప్ యొక్క కార్పొరేట్ కమ్యూనికేషన్స్













