అమరరాజా కు హైకోర్టులో ఊరట

తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ యాజమాన్యంలోని అమరరాజా బ్యాటరీస్ కంపెనీకి ఆంధప్రదేశ్ ప్రభుత్వం పెద్ద షాకిచ్చిన విషయం విదితమే. ఈ ఆదేశాలను అమరరాజా కంపెనీ హైకోర్టులో సవాల్ చేసింది. అమరరాజ కంపెనీకి హైకోర్టులో ఊరట లభించింది. కంపెనీ మూసివేయాలని పీసీబీ ఇచ్చిన ఉత్తర్వులను ఆంధప్రదేశ్ హైకోర్టు సస్పెండ్ చేసింది. అంతేకాదు విద్యుత్ పునరుద్ధరణ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూన్ 17లోపు పీసీబీ సూచనలు అమలు చేయాలని ఆదేశించింది. మళ్లీ రిపోర్ట్ ఫైల్ చేయాలని పీసీబీని కూడా హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 28కి న్యాయస్థానం వాయిదా వేసింది.