ఆమంచి సోములు రాజీనామా.. షాక్ లో జనసేన..
ఆంధ్రాలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలలో హై టెన్షన్ నెలకొంది. ఎప్పుడు ఎవరు పార్టీని వీడి పక్క పార్టీలోకి వెళ్తారో తెలియని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. పార్టీలకు వెన్నుపూస అనుకున్న వారు కూడా సడన్గా గోడ దాటేసి వెళ్ళిపోతున్నారు. ప్రస్తుతం జనసేన కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటుంది. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి సోములు జనసేనకు రాజీనామా చేశారు. ఇది నిజంగా జనసేన పార్టీ శ్రేణులకు పెద్ద షాకింగ్ న్యూస్. ఇటీవల పార్టీలో చేరిన సోములకు వెంటనే పవన్ కళ్యాణ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. ఆయనపై ఉన్న నమ్మకంతో చీరాల సమన్వయకర్తగా కూడా ఇటీవలే బాధ్యతలు అప్పగించారు. అయితే ప్రకాశం జిల్లా గిద్దలూరు నుంచి సీటు ఆశించిన ఆమంచి సోములు.. తనకు చీరాల సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించడం పై కినుకు వహించారు. ఇదే విషయాన్ని పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు రాసిన లేఖలో స్పష్టం చేసిన సోములు.. చీరాల సమన్వయకర్తగా రాజీనామా చేస్తున్నట్లు.. అయితే ఇప్పటికి పార్టీలో కార్యదర్శిగా కొనసాగబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ లేకపై నాదెండ్ల మనోహర్ తో పాటు పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.













