త్వరలో కాంగ్రెస్ లో చేరతా : ఆమంచి
చీరాల నియోజకవర్గ అభిమానులతో బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సమావేశమయ్యారు. త్వరలో షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అంటే తనకెంతో గౌరవమని, తన భావజాలానికి టీడీపీతో కలిసి ప్రయాణించలేకపోయానని పేర్కొన్నారు. వైసీపీ అధిష్ఠానం తనకు సముచిత స్థానం ఇచ్చి పర్చూరు నుంచి పోటీ చేయమందని తెలిపారు. కొద్ది రోజులుగా చీరాలలో సమావేశాలు పెట్టి అభిప్రాయం సేకరణ చేస్తే, కాంగ్రెస్లో చేరాలని అభిమానులు సూచించారని తెలిపారు. ఆటో గుర్తుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకునాన్న, కేంద్ర ఎన్నికల సంఘం ఆటో గుర్తును రద్దు చేసిందని అందువల్లే కాంగ్రెస్లో చేరుతున్నట్టు పేర్కొన్నారు. చీరాల ప్రజల మద్దతుతో భారీ మెజార్టీతో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.













