ఇక ఆమంచి రాజకీయ జీవితానికి పుల్ స్టాప్ తప్పదా..
ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో ఆమంచి కృష్ణమోహన్ పేరు తెలియని వ్యక్తులు ఉండరు. ఒకప్పుడు చక్రం తిప్పిన ఆమంచి రాజకీయ కేరీర్ ఇప్పుడు అఘమ్యగోచరంగా మారబోతోంది. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య శిష్యుడిగా చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆమంచి ఒక వెలుగు వెలిగారు. అండగా రోశయ్య ఉండడం.. వెన్నుదండగా రాజకీయం, రౌడీయిజం ఉండడం తో ఆమంచి అప్పట్లో చెలరేగిపోయాడు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ తీర్థం పుచ్చుకున్న ఆమంచి తన టీడీపీ ప్రత్యర్థి కరణం బలరాంపై గెలవలేక పోయాడు. మొదట్లో ఆమంచి హవా వైసీపీలో బాగానే కొనసాగింది.. అయితే టీడీపీ లో గెలిచిన బలరాం వైసీపీ లో ఎంట్రీ ఇవ్వడంతో ఆమంచి పెత్తనం తగ్గడం మొదలు పెట్టింది. పర్చూరు సమన్వయకర్తగా వైసీపీ అతని నియమించింది. ఇటు చీరాల సీటు కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్ కు అప్పగించింది వైసీపీ. దీంతో ఇక ఆమంచి రాజకీయ జీవితం ఆల్మోస్ట్ ముగిసినట్లే అన్న టాక్ వినిపిస్తోంది.













