వైసీపీ గూటి నుంచి కాంగ్రెస్ గూటికి ఆమంచి పయనం..
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ నుంచి సీట్లు ఎక్స్ పర్ట్ చేసిన అభ్యర్థులు అవి రాకపోవడంతో నిరాశ చెందుతున్నారు. కొందరు పార్టీలు మారడానికి కూడా వెనుకాడడం లేదు. ఈ నేపథ్యంలో బాపట్ల జిల్లా చీరాల లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి భారీ షాక్ తగిలింది. వచ్చే ఎన్నికల్లో చీరాల అసెంబ్లీ నుంచి టికెట్ ఆశించిన ఆమంచికి నిరాశ ఎదురయింది. వెంకటేష్ కు ఈ టికెట్ కేటాయించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో చీరాల నియోజకవర్గంలో నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన ఆమంచి టిడిపి అభ్యర్థి కరణం బలరాం చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత బలరాం వైసీపీ లోకి రావడంతో ఆమంచి కృష్ణమోహన్ పర్చూరు ఇన్చార్జిగా నియమించారు. పోనీ అక్కడ నుంచైనా టికెట్ దక్కుతుందా అనుకుంటే.. పర్చూరు నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా యెడం బాలాజీ పేరు ప్రకటించారు. ఇలా వరుస ఎదురు దెబ్బలు తగలడంతో ఆమంచి పార్టీని విడాలని నిర్ణయించుకున్నారు. అందుకే గురువారం నాడు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇక ఆమంచి కాంగ్రెస్ లో చేరి చీరాల నుంచే పోటీ చేస్తారు అన్న ప్రచారం కూడా జోరుగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్టానం నిర్ణయం ఏమిటో చూడాలి.













