వైసీపీలో చేరిన టీడీపీ ఎంపీ
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డిని ఎంపీ రవీంద్రబాబు లోటస్పాండ్లో కలుసుకున్నారు. అనంతరం జగన్ సక్షమంలో ఎంపీ వైసీపీలో చేరారు. ఎంపీ రవీంద్రబాబుకు జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. తూర్పు గోదావరి జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి రవీంద్రబాబుకు ఎమ్మెల్యే సీటు ఇస్తామని జగన్ హామీ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు అమలాపురం టీడీపీ ఎంపీ టికెట్ ఇచ్చేందుకు అధిష్ఠానం ఆసక్తి చూపకపోవడంతో అసంతృప్తి చెందానని, అందుకే వైసీపీలో చేరినట్లు రవీంద్రబాబు సృష్టం చేశారు.













