చంద్రబాబుని నమ్ముకుంటే ముస్లిం రిజర్వేషన్ గల్లంతే.. అంబటి రాంబాబు..
కూటమిగా ఏర్పడిన టీడీపీ, బీజేపీ, జనసేన..ప్రజాగళం పేరుతో ఓ భారీ బహిరంగ సభను నిర్వహించిన విషయం తెలిసిందే. చిలకలూరిపేట బొప్పూడి వేదికగా నిర్వహించిన ఈ సభ వెలవెల పోయింది అని అంబటి రాంబాబు విమర్శించారు. ప్రజాగళం సభ పై లేటెస్ట్ గా రియాక్ట్ అయిన అంబటి తనదైన స్టైల్ లో విమర్శలు కురిపించారు. స్వయంగా ప్రధానమంత్రి విచ్చేసినప్పటికీ టీడీపీ ,జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగళం సభకు ప్రజలు అనుకున్న రేంజ్ లో రాలేదని ఆయన విమర్శించారు. ఈ సభ ద్వారా కూటమి ప్రజలకు ఇచ్చిన సందేశం ఏమిటి అని ప్రశ్నించారు? ఇక చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ మైకు కూడా సరి చేసుకోలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఏం సరి చేస్తారు అని అంబటి విమర్శించారు.చంద్రబాబు జీవితమంతా అభద్రతతో నిండుకుందని.. చంద్రబాబు మరొకసారి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్ ఉండదు అని అంబటి రాంబాబు ఆరోపించారు. ఎందరు కలిసి వచ్చిన జగన్ ను ఓడించబోయేది లేదు అని ధీమా వ్యక్తం చేశాడు అంబటి. ప్రస్తుతం అంబటి చేసిన ఈ స్టేట్మెంట్స్ వైరల్ అయ్యాయి.













