అమరావతికి దక్కిన అదృష్టం : ఆళ్ల
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అమరావతిలో ఉంటుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం.. తమ అదృష్టమని అమరావతికి దక్కిన గౌరవంగా భావిస్తున్నామని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ తనకు రాజకీయ భవిష్యత్ కన్న, రాష్ట్ర భవిష్యత్ ముఖ్యమని పేర్కొన్నారు. అమరావతి రైతులు కోరుకుంటే వారి భూములు తిరిగి ఇవ్వాలన్నారు. అమరావతిని అగ్రికల్చర్ జోన్‌గా అభివృద్ధి చేయాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఖర్చు చేసిన దానికి రూ.700 కోట్లు వడ్డీ ప్రభుత్వం కడుతోందన్నారు. అమరావతిలోనే పెట్టుబడి అంతా పెడితే మిగతా ప్రాంతాల పరిస్థితేంటని ప్రశ్నించారు. కృష్ణా, గుంటూరు జిల్లాలు అన్ని రంగాల్లో ముందున్నాయని, రైలు కూత వినపడని గ్రామాలు ఎన్నో ఉన్నాయని అన్నారు.













