ఏపీలో లాక్డౌన్, కర్ఫ్యూ పై క్లారిటీ ఇచ్చిన మంత్రి
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో లాక్డౌన్, కర్ఫ్యూ అమలు చేసే ఆలోచన లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ వ్యాక్సినేషన్‌పై సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని పేర్కొన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సెకండ్ వేవ్‌లో భాగంగా దేశంలో కరోనా విజృంభిస్తోంది. దీంతో ఆయా రాష్ట్రాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. లాక్డౌన్లు, నైట్ కర్ఫ్యూలు విధిస్తూ కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి.













