చంద్రబాబు అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం
హాజరైన ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ – అఖిల సంఘాల సమావేశానికి హాజరైన వివిధ ఉద్యోగ సంఘాలు – ఎన్జీవోలు, గెజిటెడ్ అధికారులు, రెవెన్యూ సచివాలయ ఉద్యోగులు హాజరు – ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే దిశగా చర్చ.
ఫిబ్రవరి 1 నుంచి 13వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు: చంద్రబాబు
ప్రత్యేక హోదా కోసం పోరాడినవారిపై కేసులు ఎత్తివేస్తాం
అమరావతి: ఏపీ పట్ల కేంద్రం తీరుకు నిరసనగా ఆందోళనలు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. బుధవారం అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 13వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు చెప్పారు. 11న ఢిల్లీలో ఆందోళన చేస్తామని, 12న రాష్ట్రపతి దగ్గరకు అఖిలపక్షం వెళుతుందని ఈ మేరకు అఖిలపక్ష సమావేశంలో తీర్మానం చూసినట్లు చంద్రబాబు పేర్కొన్నారు.
తన కంటే నరేంద్ర మోదీ చాలా జూనియర్ అని.. అయినా ఆయన ఈగోను సంతృప్తిపరచాలని సర్ అని సంభోదించానని చంద్రబాబు చెప్పారు. ఏపీపై ప్రధాని కనికరం చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం పోరాడినవారిపై కేసులు ఎత్తివేస్తామన్నారు. దీనిపై ఎల్లుండి జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు.













