ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే విషయం తెలియదు : అలీ
త్వరలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడినుంచి పోటీ చేస్తాననే విషయం ఇంకా తెలియదని సినీ నటుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అలీ అన్నారు. రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడినుంచి పోటీ చేస్తాననే విషయం నాక్కూడా తెలియదు. సీఎంవో నుంచి కాల్ రావాల్సి ఉంది. ముఖ్యమంత్రి పిలిచి ఫలానా చోటు నుంచి పోటీ చెయ్ అని అంటే అందుకు సిద్ధంగా ఉన్నా. ఈ వారంలో కబురు రావచ్చు. ఏ పార్టీలో ఉన్నా, పోటీలో నిలబడిన వ్యక్తి మంచివారైతే ప్రజలు గెలిపిస్తారు. అక్కడినుంచి ఇక్కడికి, ఇక్కడినుంచి అక్కడికి పార్టీలు మారిన వాళ్లు చాలామంది ఉన్నారు. ఎవరు ఏమిటనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఎవరితో ఎవరు పొత్తులు పెట్టుకున్నా. అంతిమ నిర్ణయం ఓటరుదే. ఎన్నికలకు మేమూ సిద్ధం అంటున్నాం, వాళ్లూ సిద్ధం అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో అని అన్నారు.













