Alapati Suresh Kumar: ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఆలపాటి సురేష్ కుమార్

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీలో భాగంగా ఎపి ప్రెస్ అకాడమీ (AP Press Academy) చైర్మన్ గా ఆలపాటి సురేష్ కుమార్ (Alapati Suresh Kumar)ను నియమించింది. వివిధ పత్రికల్లో పనిచేయడంతోపాటు ఇండిపెండెంట్ జర్నలిస్టుగా ఉంటూ గత ప్రభుత్వ అన్యాయాలను వెలుగులోకి తీసుకువచ్చారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఐదేళ్ళ పాలనపై ఇటీవలే విధ్వంసం పేరిట పుస్తకం విడుదల చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. సీనియర్ జర్నలిస్టుగా ఉన్న ఆలపాటి సురేష్ కుమార్ సేవలను ఉపయోగించుకోవాలన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనను ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి చైర్మన్ గా నియమించారు.