టీడీపీ అధికారంలోకి రాకపోతే రాజకీయాలకు గుడ్ బై
రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రాకపోతే తానూ రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెనాలి శాసన సభ్యుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ తలసాని శ్రీనివాస్ ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నీతి నిజాయతీలు లేని వ్యక్తులు రాజకీయాలకు పనికిరారన్నారు. తలసాని మాట్లాడే మాటల విధానం మార్చుకోవాలని సూచించారు. తెలంగాణ ఎన్నికల్లో గెలిచిన మాజీ మంత్రులు ఏపీలో మాట్లాడిన మాటలు వింటుంటే వారు ఎన్నికల్లో ఎలా గెలిచారో అర్థం కావడం లేదన్నారు. రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని మాట్లాడే వారికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నానని, టీడీపీ గెలవకపోతే రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆలాపాటి వెల్లడించారు.













