Alapati :ఆలపాటి రాజా నామినేషన్
పట్టభద్రుల మనోభావాలకు, ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వంతో ఉన్న అనుబంధంతో ఆలపాటి రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) వారికి మంచి చేస్తారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao )అన్నారు. కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ (MLC) అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూటమి నాయకులతో కలిసి భారీ ర్యాలీగా వచ్చి గుంటూరు కలెక్టరేట్లో ఎన్నిక అధికారి నాగలక్ష్మి (Nagalakshmi)కి నామినేషన్ అందజేశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏన్డీయే (NDA) పక్ష అభ్యర్థిగా ఆలపాటిని ప్రకటించామన్నారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో మెగా డీఎస్సీ, ప్రైవేటు పెట్టుబడులు తెచ్చి ఉద్యోగాలను కల్పించడంలోనూ కూటమి ప్రభుత్వం దూసుకెళుతోందన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలు, నిరుద్యోగ యువత, పట్టబద్రుల సమస్యల పరిష్కారానికి అందరితో కలిసి పని చేస్తానన్నారు.













