రాజ్యసభలో కీలక విషయాలు… తెలుగు రాష్ట్రాల్లో ఏటా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బాలికలు, మహిళల అదృశ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక విషయాలు వెల్లడించింది. రాజ్యసభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఏటా వేల సంఖ్యలో బాలికలు, మహిళలు అదృశ్యమవుతున్నారని హోంశాఖ వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత మూడేళ్లలో 72,767 మంది అదృశ్యం అయినట్టు పార్లమెంట్‌కు నివేదించింది. వీరిలో 15,994 బాలికలు, 56,773 మంది మహిళలు ఉన్నట్టు తెలిపింది. జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో మహిళలు అదృశ్యమవుతున్న కేసులు ఏటేటా పెరుగుతున్నాయని కేంద్రం నివేదికలో వెల్లడించింది.













