విశాఖ-బ్యాంకాక్ మధ్య విమానం
విశాఖ-బ్యాంకాక్ మధ్య విమాన సర్వీసు నడిపేందుకు థాయ్ ఎయిర్ ఏషియా ముందుకొచ్చినట్లు ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ (ఇండియా) అధ్యక్షులు డి.వరదారెడ్డి తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి రోజువారీ తిరిగే ఈ విమానానికి ఇంకా సమయాలు నిర్థరణ కావాల్సి ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సర్వీసు అందుబాటులోకి వస్తే, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, లావోస్, కంబోడియా తదితర దేశాలకు వెళ్లేవారికి సౌకర్యంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం విశాఖ నుంచి హాకాంగ్, జపాన్ థాయ్‌లాండ్‌కు పర్యటకుల తాకిడి ఎక్కువగా ఉందని తెలిపారు. ఈ పరిశీలనల తర్వాత థాయ్ ఎయిర్ ఏషియా ఆసక్తి చూపిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయంతో విశాఖ నుంచి మరో అంతర్జాతీయ సర్వీసు మొదలయ్యేందుకు అవకాశం ఏర్పడింది.













