విజయవాడలో ఏఐసీసీ వర్కింగ్ కమిటీ భేటీ ?
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (ఏఐసీసీ) సమావేశం విజయవాడలో నిర్వహించేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఊమెన్ చాందీ, పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని విజయవాడలో నిర్వహించాలని రఘువీరారెడ్డి ప్రతిపాదించారు. అలాగే ప్రత్యేక హోదా పేరిట రాష్ట్రంలో త్వరలో చేపట్టనున్న భరోసా ప్రజాయాత్రలో పాల్గొనాలని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలను ఆహ్వానించారు.













