మద్యం కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై .. విచారణ వాయిదా
మద్యం కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఈ కేసులో ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్, చంద్రబాబు తరపున నాగమత్తు, దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని ఎక్సైజ్ కమిషనర్ ప్రతిపాదన పంపారని, కమిషనర్ ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించిందని న్యాయవాది నాగమత్తు కోర్టు తెలిపారు. ఫైల్‌పై అప్పటి రెవెన్యూ స్పెషల్ సీఎస్ సంతకాలు చేశారని వివరించారు. ప్రివిలేజ్ ఫీజు రద్దు చంద్రబాబు వ్యక్తిగత నిర్ణయం కాదని పేర్కొన్నారు. ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.













