టీడీపీలోకి ఆదిశేషగిరిరావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అండగా ఉండేందుకు ఘట్టమనేని కుటుంబం యావత్తు సిద్ధంగా ఉందని సినీనటుడు కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు తెలిపారు. టీడీపీ రాష్ట్ర నాయకుల బృందం గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలోని ఆదిశేషగిరిరావు స్వగృహానికి వెళ్లి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానిస్తూ చర్చలు జరిపింది. ఈ సందర్భంగా ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ ఈ నెల 7న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. అమరావతి, పోలవరం పూర్తి కావాలంటే చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఉందని సృష్టం చేశారు.













