శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 26 నుంచి 2020 జనవరి 19వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు నిర్వహించనున్నారు. సాధారణంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందు శ్రీవారి సన్నిధిలో దివ్యప్రబంధ అధ్యయనంగా పిలిచే ఈ అధ్యయనోత్సవం ప్రారంభమవుతుంది. స్వామివారి ప్రాశస్త్యంపై ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను 25 రోజుల పాటు శ్రీశైష్టవ జీయంగార్లు గోష్ఠిగానం చేస్తారు. తొలి 11 రోజులను పగల్పత్తు అని, తర్వాతి 10 రోజులను రాపత్తు అని వ్వవహరిస్తారు. 22వ రోజున కణ్ణినుణ్ శిరుత్తాంబు, 23వ రోజున రామానుజ సూట్రందాది, 24వ రోజున శ్రీవరాహస్వామివారి సాత్తుమొర. 25వ రోజున అధ్యయనోత్సవాల ముగింపు కార్యక్రమాలు జరుగుతాయి.













