ఆ సంస్కృతిని అలవాటు చేస్తే రాబోయే తరాలకు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులు బూతు పురాణం మొదలుపెట్టారని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయం అంటే పది మందికి ఆదర్శంగా ఉండాలే కానీ చీదర తెప్పించకూడదన్నారు. ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయ నేతలు ఆ విధంగా మాట్లాడటం సరికాదని తెలిపారు. ఆ సంస్కవృతిని అలవాటు చేస్తే రాబోయే తరాలకు చెడు మార్గాన్ని చూపించినట్లు అవుతుందని అన్నారు. టీవీ పెడితే మనం ఏమి చేస్తున్నామో తెలియాలని కానీ ఇప్పుడు మాత్రం టీవీలు పెడితే నలుగురు కుటుంబ సభ్యులు మన నాయకులు ఏమీ మాట్లాడుతున్నారో చూడలేని పరిస్థితికి రావటం మన దౌర్భాగ్యమని అన్నారు.













