Madhavi Latha :జేసీ ప్రభాకర్ రెడ్డిపై న్యాయపోరాటం చేస్తా : మాధవీలత
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి (JC Prabhakar Reddy) పై సినీ నటి మాధవీలత (Madhavi Latha )మా కు, తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభాకర్ రెడ్డి తన గురించి చేసిన వ్యాఖ్యలపై సినీ పరిశ్రమ (Film industry) స్పందించలేదు కాబట్టే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (Movie Artist Association)కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభాకర్ రెడ్డి నా గురించి దారుణంగా మాట్లాడారు. సినిమా వాళ్లపై ఆరోపణలు చేయడం సరైనది కాదు. ఆయన క్షమాపణలు చెబితే సరిపోదు. ప్రభాకర్ రెడ్డిపై న్యాయపోరాటం చేస్తాను. ఆయన నాపై చేసిన వ్యాఖ్యలను సినీ పరిశ్రమ ఖండిరచలేదు. అందుకే ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేస్తున్నాను అని తెలిపారు.













