ఏపీ అద్భుతంగా అభివృద్ధి : శివాజీ
ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా అభివృద్ధి చెందుతోందని నటుడు శివాజీ అన్నారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా కోటప్ప కొండకు వచ్చిన ఆయన కోటీశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రులు ఏపీకి తిరిగి రావాలని అన్నారు. ఎవరూ ఊహించని రీతిలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని అన్నారు. మీసం మెలేసి చెప్పుకునే విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని శివాజీ గర్వంగా చెప్పారు. తెలుగువాళ్లంతా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్నారని, ఇప్పుడు అందరూ ఏపీకి తిరిగి రావాలని ఆయన పిలుపునిచ్చారు.













