Atchannaidu :సభ్యత్వాలు పోతాయనే భయంతోనే.. ఇలా వచ్చి అలా వెళ్లారు
అసెంబ్లీ సమావేశాలకు ఇలా వచ్చి అలా వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యేలు(MLAs) , జగన్(Jagan)పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు(Atchannaidu) తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హాజరు కోసమే సభకు వచ్చారని తేటతెల్లమైందని వ్యాఖ్యానించారు. సభ్యత్వాలు పోతాయనే భయంతోనే వచ్చారని భావిస్తున్నట్లు తెలిపారు. వైసీపీ (YCP)నేతల తీరు అటెండెన్స్ (Attendance) వేయించుకుని వెళ్లినట్లయింది. సభ్యత్వాలు పోతాయనే భయంతోనే వచ్చారని భావిస్తున్నాం. హాజరు కోసమే సభకు వచ్చారని తేలిపోయింది. అవినీతి, అబద్దాల పునాదులపై ఆ పార్టీ పుట్టింది. గతంలో చెప్పిన అవాస్తవాలనే మళ్లీ చెబుతున్నారు. సభకు వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడతారని భావించాం. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామనడం ఎక్కడా చూడలేదు. అబద్దాలు చెప్పి ప్రజలను మభ్య పెడుతున్నారు. 11 స్థానాల్లో గెలిచి ప్రతిపక్ష హోదా అడగడం హాస్యాస్పదం. సీనియర్లు కూడా జగన్కు వత్తాసు పలకడం దురదృష్టకరం అని అన్నారు.













