మళ్లీ చంద్రబాబును గెలిపిస్తేనే… రాష్ట్రం
మళ్లీ చంద్రబాబును గెలిపిస్తేనే రాష్ట్రం గాడిన పడుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. మహానాడులో ఆయన మాట్లాడుతూ 2019లో తెలిసో, తెలియకో ప్రజలు తప్పు చేశారు. చంద్రబాబును ఓడిరచటం ప్రజలు చేసిన తప్పు అన్నారు. రూ.లక్షల కోట్లు దోపిడీ చేసిన వ్యక్తికి ఓటు వేసి గెలిపించారు. ఈ మూడేళ్లలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. మళ్లీ రాష్ట్రం గాడిలో పడాలంటే అంత ఈజీ కాదు. హత్యలు చేసిన వైసీపీ నేతలు అమలాపురంలో అల్లర్లు సృష్టించారు. మూడేళ్లుగా టీడీపీ కార్యకర్తలు బయటకు రావాలంటే, నాయకులు మాట్లాడాలంటే భయపడ్డారు. మహానాడు ప్రభంజనం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ 160 స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు అని అన్నారు.













