జైలు నుంచి విడుదలైన అచ్చెన్నాయుడు
వైకాపా సర్కారు కక్షసాధింపు చర్యలకు భయపడేది లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సృష్టం చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత మీడియాతో మాట్లాడుతూ అచ్చెన్న భావోద్వేగానికి గురయ్యారు. సంబంధంలేని విషయంలో తప్పుడు కేసులు పెట్టారని కంటతడి పెట్టారు. రాష్ట్రంలో జగన్ మోహన్‌రెడ్డికి, వైకాపాకు కింజరపు కుటుంబం గుదిబండలా తయారైందని వ్యాఖ్యానించారు. బెయిల్‌పై విడుదలైన అచ్చెన్నాయుడికి నరసన్నపేట నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. మాజీ ఎమ్మెల్యే రమణమూర్తి ఆధ్వర్యంలో సత్యవరం కూడలి వద్ద స్వాగతించారు. తామరపల్లి గ్రామం వద్ద కూడా టీడీపీ కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం నిమ్మాడ గ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి అచ్చెన్నాయుడు ఓటు హక్కు వినియోగించుకున్నారు.













