కుప్పం ఘటనకు మూల్యం చెల్లించుకోక తప్పదు : అచ్చెన్న
కుప్పంలో అన్నా క్యాంటీన్‌పై జరిగిన దాడిని ఖండిస్తున్నామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ దాడి హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. చంద్రబాబును కుప్పంలో తిరగకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటామని తెలిపారు. కుప్పం ఘటనకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. సీఎం జగన్ దర్శకత్వంలో వైసీపీ శ్రేణులు అన్న క్యాంటీన్‌ను ధ్వంసం చేశాయని ఆరోపించారు. కుప్పంలో శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. కుప్పంలో వైసీపీ శ్రేణులను పోలీసులు నియంత్రిచాలని, లేకుంటే సీఎంవో, డీజీపీ కార్యాలయాలను ముట్టడిస్తామన్నారు. త్వరలో కడపలో సమావేశం పెడతామని ఎలా అడ్డుకుంటారో చూస్తామని మండిపడ్డారు.













