ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే బడ్జెట్ సమావేశాలకు : అచ్చెన్నాయుడు
ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. టీడీపీ శాసనసభాక్షం సమావేం అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. శాసనసభా ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిందుకే బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. శాసనసభకు రాకుండా పారిపోతున్నామని కొందరు నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో కీలక బిల్లులపై విపక్షాలతోనూ చర్చించేవాళ్లు, రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకోవాలటే శాసనసభ్యులందరి అభిప్రాయాలు తీసుకొని చర్చించాకే నిర్ణయం తీసుకుంటారు. గత మూడేళ్లలో ఇలాంటి పరిస్థితులు లేకపోవడమే కాకుండా విపక్ష సభ్యులకు చట్టసభల్లో అవమనాలు ఎదురయ్యాయి అని అన్నారు.
అమరావతిపై తీర్పుతో హైకోర్టు మెట్టికాయలు వేసిన ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పు లేదన్నారు. అదే ఒంటెద్దు పోకడలతో ముందుకెళ్లోంది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. అన్ని సమస్యలను చట్టసభల్లో ప్రశ్నిస్తామన్నారు. సభలో విపక్ష సభ్యులు మాట్లాడేందుకు సమయం ఇవ్వాలి. కొన్ని మీడియా ఛానెళ్లను ప్రభుత్వం బహిష్కరించడం తగదన్నారు. సభ ప్రసారాలకు అన్ని ఛానెళ్లను అనుమతించాలన్నారు.













