టీడీపీ అధికారంలోకి వచ్చాక …వారి డిమాండ్లు పరిష్కారిస్తాం : అచ్చెన్న
అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్లు నెరవేర్చకుండా నిర్బంధాలు, అక్రమ అరెస్టులు ఎలా చేస్తారని టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయపోరాటానికి టీడీపీ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. అంగన్వాడీపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎందుకంత కక్ష? టీడీపీ అధికారంలోకి వచ్చాక అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చారు. మరోవైపు అంగన్వాడీల నిరవధిక సమ్మె రెండో రోజూ కొనసాగుతోంది. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే సమ్మె మరింత ఉద్ధóృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.













