అవసరమైతే అందరం కలిసి రాజీనామా
విశాఖ ఉక్కు పరిశ్రమపై వైకాపా సర్కారు స్పందించలేదని ఆంధప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు కర్త, కర్మ, క్రియ ముఖ్యమంత్రి వైఎస్ జగనే అని ఆయన ఆరోపించారు. విశాఖలో మీడియాతో అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఉక్కు ఉద్యమాన్ని ఉద్థ•తం చేస్తామని చెప్పారు. ఉక్కు పరిశ్రమ కోసం ముఖ్యమంత్రి జగన్ వెంట నడిచేందుకు సిద్ధమని, అవసరమైతే అందరం కలిసి రాజీనామా చేద్దామని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నాయకత్వం వహిస్తే వెంట నడిచేందుకు మేం సిద్ధమన్నారు. ఉక్కు పోరులో రాజీనామా చేసిన ఎంపీల స్థానాల్లో పోటీ పెట్టబోమని హామీ ఇచ్చారు.













