బాలకృష్ణ ఇంటిపై కాదు.. సీఎం వైఎస్ జగన్ ఇంటిపై
హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడికి యత్నించడంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందూపురం అభివృద్ధిపై స్థానికులు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బాలకృష్ణ ఇంటికిపై కాదు, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇంటిపై దాడి చేయాలని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భౌతిక దాడులు పెరిగాయన్న డీజీపీ క్రైమ్ రిపోర్టు చూసైనా తెలుసుకోవాలన్నారు. ప్రజా ప్రతినిధి ఇంటిపైనే దాడికి పాల్పడితే ప్రజల పరిస్థితేంటి? అని ప్రశ్నించారు. భయపెట్టి పాలన సాగిస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోవాలా? అని నిలదీశారు. రాష్ట్రంలో అభివృద్ధి మరచిపోయి రెండున్నరేళ్లు గడిచిందని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ చేసిన అభివృద్ధి ఏమి లేదని అన్నారు.













