ఏపీకి వైసీపీ ఏం సాధించింది?
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైసీపీ ఎంపీలు ఏం సాధించిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. కేంద్ర బడ్జెట్‌పై ఆయన మాట్లాడుతూ 28 మంది ఎంపీలుండి వైసీపీ ఏం చేశారని అన్నారు. కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలు ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఆరోపించారు. వైసీపీ ఎంపీల చేతకానితనంతోనే కేంద్ర బడ్జెట్‌తో ఆంధ్రప్రదేశ్‌కు మొండిచేయి ఎదురైందన్నారు. సవరించిన పోలవరం అంచనాలను కేంద్రం ఆమోదించకపోవడం వైసీపీ ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని విమర్శించారు.













