టీడీపీ-జనసేన కలిస్తే.. వైసీపీకి డిపాజిట్లు కూడా రావు
యువగళం కాదు ప్రజాగళమని లోకేశ్ నిరూపించారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోకేశ్ నాయకుడే కాదు, పోరాట యోధుడు కూడా. యువగళం పాదయాత్రకు ఎన్నో అడ్డంకులు సృష్టించారు. అయినా లెక్క చేయకుండా ప్రభుత్వ తప్పులు, అవినీతిని ఎండగట్టారు. జగన్ కొత్త నాటకాలు ఆడుతున్నారు. టీడీపీ, జనసేనను బలహీనవర్గాలకు దూరం చేయాలని కుట్ర పన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్దిపొందేందుకు ప్రయత్నిస్తున్నారు. జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు మొత్తం దోచేశారు. టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తే వైసీపీకి డిపాజిట్లు కూడా రావు. రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీ`జనసేనను ప్రజలు ఆదరించాలి అని విజ్ఞప్తి చేశారు.













