ఆస్పత్రి నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈఎస్ఐ కేసులో అరెస్టయిన ఆయనకు ఇటీవల కరోనా సోకడంతో గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆదివారం ఆయనకు నిర్వహించిన పరీక్షలో కరోనా నెగటివ్ రావడంతో ఈరోజు వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఈఎస్ఐ కేసులో ఇప్పటికే అచ్చెన్నాయుడుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం అచ్చెన్నాయుడు నేరుగా శ్రీకాకుళం జిల్లాలోని తన స్వగ్రామం నిమ్మాడకు బయల్దేరి వెళ్లారు.













